
సినిమాలు

యువ నటుడు భరత్ కాంత్ మరియు సినిమాటోగ్రాఫర్ సాయి త్రిలోక్ నిన్న ఆదిబట్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరుకు చెందిన ఈ ఇద్దరూ హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా, వారి కారు ఔటర్ రింగ్ రోడ్‌పై కంటైనర్ లారీని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అతివేగంతో జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. భరత్ కాంత్, సాయి త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు వారి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!