

ఉప్పల్‌లో మరోసారి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చాలా ఏళ్ల తర్వాత వాహనదారులు మళ్లీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగురోడ్డుకు వాహనాల రాకపోకలను మళ్లించారు. శ్మశానాల వద్ద కారిడార్‌కు సంబంధించిన పిల్లర్ల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరుకైన ఈ మార్గాన్ని మూసివేయాల్సి వచ్చింది. అయితే సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వరంగల్ హైవే నుంచి వచ్చే వారు నల్లచెరువు దాటాక ఏషియన్ మాల్ వద్ద నుంచి భగాయత్‌లోని హెచ్ఎండీఏ లేఅవుట్ మార్గం ఉపయోగించాల్సి ఉంటుంది.
నగరం నుంచి వచ్చే వాహనాలు పిస్తా హౌస్, ఎల్ఎఫ్ఎస్ వెనుక నుంచి బీరప్పగడ్డ మీదుగా సబ్‌స్టేషన్ వద్ద వరంగల్ హైవేకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు సుమారు మూడు నెలలపాటు కొనసాగనుంది. వాస్తవానికి గత నెల 26 నుంచే అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు వర్షాకాలంలో అమలు చేయడంతో వాహనదారులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక, సూచికల లేమితో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!