
క్రీడలు

డేవిస్ కప్ క్వాలిఫయర్ రెండో రౌండ్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. దక్షిణ కొరియా 3-1తో భారత్‌పై విజయం సాధించి ఫైనల్ 8లో చోటు దక్కించుకుంది. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లోనూ భారత్ ఓటమిపాలై 0-2తో వెనుకబడింది. రెండో రోజైన శనివారం డబుల్స్‌లో దక్షిణేశ్వర్, శ్రీరామ్ బాలాజీ జోడీ 6-3, 3-6, 6-3తో నామ్ జి సంగ్, పార్క్ ఉయి సంగ్ జంటను ఓడించి భారత్ ఆశలను సజీవంగా ఉంచింది.
అయితే కీలకమైన రివర్స్ సింగిల్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సుమిత్ నగాల్ 1-6, 2-6తో సూన్‌వూ క్వోన్ చేతిలో ఓటమి చెందడంతో దక్షిణ కొరియా 3-1తో టైను కైవసం చేసుకుంది. దీంతో కొరియా డేవిస్ కప్ ఫైనల్ 8కు అర్హత సాధించగా, రెండో క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే భారత జట్టు ప్రయాణం ముగిసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!