7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీప్‌ఫేక్‌ వీడియోలతో ఎమ్మెల్సీకి బెదిరింపులు

Writer: Pooja 05:59 AM, 7 నవంబర్, 2026
డీప్‌ఫేక్‌ వీడియోలతో ఎమ్మెల్సీకి బెదిరింపులు

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ ముఠా ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌కు సంబంధించిన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌ వీడియోలను సృష్టించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరిస్తూ తొలుత రూ.5 కోట్లు డిమాండ్‌ చేసిన నిందితులు.. చివరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. బెదిరింపులతో ఆందోళనకు గురైన ఎమ్మెల్సీ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన కోళ్ల వ్యాపారి మహ్మద్‌ మొహిసిన్‌ఖాన్‌, ఫాతిమా బేగం, మహ్మద్‌ సమీర్‌, మహ్మద్‌ జమీర్‌, సయ్యద్‌ రెహాన్‌, బార్కస్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఇమ్రాన్‌ సహా మొత్తం 14 మంది ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీకి సంబంధించిన కొన్ని ప్రైవేట్‌ వీడియోలను సేకరించి, వాటిని డీప్‌ఫేక్‌ సాంకేతికతతో అసభ్యకరంగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను ఎమ్మెల్సీ మొబైల్‌కు పంపించి, డబ్బులు ఇవ్వకపోతే సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి పరువు తీస్తామని బెదిరించారు. పోలీసుల సూచన మేరకు ఎమ్మెల్సీ నిందితులతో బేరం జరిపారు. తొలుత రూ.5 కోట్లు డిమాండ్‌ చేసిన ముఠా చివరకు రూ.5 లక్షలకు అంగీకరించింది.

పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వచ్చి డబ్బు తీసుకోవాలని చెప్పడంతో.. గురువారం ఆరుగురు నిందితులు అక్కడికి చేరుకుని, పెట్టెలో ప్యాక్‌ చేసిన నగదును తీసుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు వారు పారిపోతుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ఎనిమిది మంది పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. గతంలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మీర్జా రహమత్‌ బేగ్‌ను ఎంఐఎం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ బ్లాక్‌మెయిల్‌ వ్యవహారం వెనుక ఆయన ప్రత్యర్థుల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా వెనుక ఉన్న సూత్రధారులు, ఎమ్మెల్సీని లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు

తిరుమలలో భక్తుల రద్దీ మధ్య కొనసాగుతున్న శ్రీవారి దర్శనాలు

తిరుమలలో భక్తుల రద్దీ మధ్య కొనసాగుతున్న శ్రీవారి దర్శనాలు

అమెరికా సంస్థలతో మైనింగ్ భాగస్వామ్యానికి సింగరేణి సిద్ధం

అమెరికా సంస్థలతో మైనింగ్ భాగస్వామ్యానికి సింగరేణి సిద్ధం

ట్యాగ్లు
డీప్‌ఫేక్‌ వీడియోలుఎమ్మెల్సీ బ్లాక్‌మెయిల్‌నార్సింగి పోలీసులుసైబర్ నేరాలుహైదరాబాద్ క్రైమ్ న్యూస్పోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో తమన్నా సినిమాకు ఊహించని ట్విస్ట్
ఓటీటీ

ఓటీటీలో తమన్నా సినిమాకు ఊహించని ట్విస్ట్

72వ వసంతంలోకి అడుగుపెట్టిన కమల్ హాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
సినిమాలు

72వ వసంతంలోకి అడుగుపెట్టిన కమల్ హాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
రాజకీయాలు

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి
జనరల్

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం
జనరల్

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం

చలికాలంలో ఈ తప్పులు చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

చలికాలంలో ఈ తప్పులు చేయొద్దంటున్న వైద్యులు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు
బిజినెస్

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు
జనరల్

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు
జనరల్

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు

తిరుమలలో భక్తుల రద్దీ మధ్య కొనసాగుతున్న శ్రీవారి దర్శనాలు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ మధ్య కొనసాగుతున్న శ్రీవారి దర్శనాలు

అమెరికా సంస్థలతో మైనింగ్ భాగస్వామ్యానికి సింగరేణి సిద్ధం
జనరల్

అమెరికా సంస్థలతో మైనింగ్ భాగస్వామ్యానికి సింగరేణి సిద్ధం

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో ఐటీ ఉద్యోగికి టోకరా
జనరల్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో ఐటీ ఉద్యోగికి టోకరా

రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
జనరల్

రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తన పోరాటం ఫలించిందన్న కవిత..ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
రాజకీయాలు

తన పోరాటం ఫలించిందన్న కవిత..ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!