

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16.9 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల లోపు నమోదయ్యాయి.
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి, తెల్లవారుజామున చలి ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!