

ఢిల్లీలో నిర్వహించిన వివిధ రక్షణ, వ్యూహాత్మక వ్యవస్థల ఆవిష్కరణ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యానికి అత్యాధునిక F-INSAS వ్యవస్థను అందజేశారు. ‘ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్’గా పిలిచే ఈ వ్యవస్థ ద్వారా సైనికులకు ఆధునిక సాంకేతికత, మెరుగైన రక్షణ, కార్యాచరణ సామర్థ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
F-INSAS పూర్తి గేర్‌లో భాగంగా శక్తివంతమైన AK-203 అసాల్ట్ రైఫిల్‌ను కూడా సైన్యానికి అందించారు. రష్యా సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ రైఫిల్ గ్యాస్ ఆపరేటెడ్, మ్యాగజైన్ ఫెడ్, సెలెక్ట్ ఫైర్ విధానంలో పనిచేస్తుంది. 300 మీటర్ల దూరం వరకు లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే సామర్థ్యం ఈ రైఫిల్‌కు ఉంది. భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో AK-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు. ఈ చర్య దేశీయ రక్షణ తయారీని, భారత్-రష్యా రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!