

విశాఖపట్నానికి చెందిన 19 ఏళ్ల చెస్ క్రీడాకారిణి సాహితి వర్షిణి మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదాను సొంతం చేసుకుంది. సెర్బియాలో జరిగిన ఐఎం-7 రౌండ్‌రాబిన్ టోర్నీలో ఆమె మూడో, చివరి డబ్ల్యూజీఎం నార్మ్‌ను సాధించింది. 9 రౌండ్లలో 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన సాహితి.. 2408 పర్ఫామెన్స్ రేటింగ్‌తో పాటు 23 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు నీలేష్ సాహా, వేదాంత్ పనేసర్‌పై విజయాలు నమోదు చేసింది.
సాహితి వర్షిణి తొలి డబ్ల్యూజీఎం నార్మ్‌ను 2025 సెప్టెంబరులో హంగేరిలో జరిగిన గోల్డెన్ హార్స్ ఐఎం రౌండ్‌రాబిన్ టోర్నీలో, రెండో నార్మ్‌ను 2026 ఆగస్టులో జరిగిన కనిజ్‌సా ఓపెన్‌లో సాధించింది. చిన్న వయసులోనే చెస్‌పై ఆసక్తి పెంచుకున్న సాహితికి ఆమె తండ్రి లోకేశ్వరరావు శిక్షణ ఇచ్చారు. సుమారు ఐదున్నరేళ్ల వయసు నుంచే ఆమెకు చెస్ శిక్షణ ప్రారంభమైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజయాలతో ముందుకు సాగిన సాహితి.. ఇప్పుడు డబ్ల్యూజీఎం హోదాను సాధించి అంతర్జాతీయ చెస్‌లో మరో మైలురాయిని అందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!