

నేపాల్‌లో భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తెలంగాణకు చెందిన వారికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లో ఉన్న యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర తెలంగాణ వాసులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, ట్రావెల్ లేదా టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను అందించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!