
రాజకీయాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్లో నిర్వహించనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
కరీంనగర్ పర్యటన సందర్భంగా అమిత్ షా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ, సంస్థాగత అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో అమిత్ షా రాకకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.













కామెంట్స్ (1)
Good news