

మైనర్లు థియేటర్లలో ‘ఏ’ (A) సర్టిఫికెట్ పొందిన సినిమాలను వీక్షించకుండా నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం ఆరుగురు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి చంచల్ కుమార్‌కు నోటీసులు అందాయి.
అలాగే కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (CBFC)కి చెందిన ఉన్నతాధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ సర్టిఫికెట్ సినిమాలను మైనర్లు చూడకుండా నిరోధించేందుకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం జరిగిందన్న అంశంపై కోర్టు ఈ చర్యలు తీసుకుంది. థియేటర్లలో వయోపరిమితి నిబంధనలను పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందనే అంశం ఈ కేసులో ప్రాధాన్యత సంతరించుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!