14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Writer: Nithish 06:42 AM, 14 అక్టోబర్, 2026
సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా బోనస్‌ అందించనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం, అంటే రూ.596 కోట్లను కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సంస్థలోని 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున రూ.1,53,912 చొప్పున, 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్‌ చెల్లించనున్నట్లు చెప్పారు.

కార్మికుల సంక్షేమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 300 డిపెండెంట్‌ ఆర్డర్లను 15 రోజుల్లో అర్హులకు అందజేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అధికారులకు పనితీరు ఆధారిత వేతనం (పీఆర్పీ) చెల్లిస్తామని చెప్పారు. మైనింగ్‌ జరగని సింగరేణి భూములను గుర్తించి నెహ్రూ హౌసింగ్‌ కాలనీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలో సింగరేణి సమస్యలను పరిష్కరించడంలో భారాస విఫలమైందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం

అరాంకోపై క్షిపణి దాడి.. సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు

అరాంకోపై క్షిపణి దాడి.. సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

ట్యాగ్లు
సింగరేణిసింగరేణి కార్మికులుదసరా బోనస్భట్టి విక్రమార్కశ్రీధర్‌బాబుతెలంగాణ ప్రభుత్వంబొగ్గు గనులుకార్మికుల సంక్షేమంకాంట్రాక్టు కార్మికులుపీఆర్పీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజకీయాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్
బిజినెస్

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ
రాజకీయాలు

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన
ఆరోగ్యం

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు
క్రీడలు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు
క్రీడలు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు
బిజినెస్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి
జనరల్

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం
జనరల్

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం

అరాంకోపై క్షిపణి దాడి.. సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు
జనరల్

అరాంకోపై క్షిపణి దాడి.. సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!