
జనరల్

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు సంబంధించిన ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు విద్యుత్ సౌధలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సౌధ ప్రాంగణంలో సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించడాన్ని తెలంగాణ జెన్‌కో నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హెచ్‌ఆర్ డైరెక్టర్ ఎస్.వి. కుమార్ రాజు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నిషేధాన్ని ఉల్లంఘించే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను కొనసాగిస్తున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!