
జనరల్

డ్రగ్స్ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో తెలంగాణ పోలీసుశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ల పనితీరును అంచనా వేసేందుకు నిర్దేశించిన ఏడు ప్రమాణాల్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఈగల్ ఫోర్స్ 80 శాతానికి పైగా మార్కులు సాధించాయి.
న్యూఢిల్లీలో మంగళవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన మూడో జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలంగాణ పోలీసుల తరఫున జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ సందీప్ శాండిల్యతో పాటు ఈగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!