

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక మహాసభ ‘మహానాడు’ నిర్వహణకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిసారిగా జిల్లాలో రాష్ట్రస్థాయి మహానాడు నిర్వహించబడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బుధవారం ఉదయం కొడవలూరు మండలం చంద్రశేఖరపురం సమీపంలోని ఇఫ్కో సెజ్ ప్రాంగణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు భూమిపూజ నిర్వహించారు. మంత్రులు పి. నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.
పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఆదేశాల మేరకు లక్షలాది మంది కార్యకర్తలకు సౌకర్యంగా ఉండేలా 2,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతాన్ని మహానాడు వేదికగా ఎంపిక చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మే 27, 28, 29 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక తీర్మానాలు ఆమోదించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!