
జనరల్

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందుకున్న తొలి నెల జీతం రూ.3 లక్షలను అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వయంగా అందజేశారు.
దేశం కోసం అహర్నిశలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విజయ్ తెలిపారు. ఆ బాధ్యతలో భాగంగానే తన తొలి వేతనాన్ని సైనిక కుటుంబాల సంక్షేమానికి అందించినట్లు పేర్కొన్నారు. పదవి చేపట్టిన వెంటనే తన మొదటి నెల జీతాన్ని దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అందించడంపై పలువురు విజయ్‌ను అభినందిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!