4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

Writer: Nithish 06:02 AM, 4 సెప్టెంబర్, 2026
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

భారత్‌–బెల్జియం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, సాంకేతికత సహా వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి. బెల్జియం ప్రధాని బార్ట్‌ డి వేవెర్‌ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వచ్చే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. ప్రపంచం సంక్షోభాలు, ఘర్షణలు, సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. గత త్రైమాసికంలో 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌–బెల్జియం రక్షణ, భద్రతా సహకారాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు కీలక స్తంభంగా అభివర్ణించారు. సైనిక మార్పిడులు, శిక్షణ, రక్షణ రంగంలో సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి కొత్త అవకాశాలను కల్పించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. స్టార్టప్‌లు, మారిటైమ్‌, విశ్వవిద్యాలయాలు, పరిశోధన రంగాల్లోనూ సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రతిభావంతుల రాకపోకలను సులభతరం చేసేందుకు ‘వలస, బదిలీ భాగస్వామ్య ఒప్పందం’పై త్వరలో ముందుకు సాగుతామని చెప్పారు. భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని బెల్జియం ప్రధాని స్వాగతిస్తూ.. ఇరుదేశాలు గతంలో కంటే విస్తృతమైన, వ్యూహాత్మక సంబంధాలను నిర్మించుకుంటున్నాయని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

ట్యాగ్లు
భారత్ బెల్జియం సంబంధాలునరేంద్ర మోదీబార్ట్ డి వేవెర్భారత్ బెల్జియం ఒప్పందాలుద్వైపాక్షిక వాణిజ్యంరక్షణ సహకారంస్వచ్ఛ ఇంధనంకీలక ఖనిజాలుటెక్నాలజీ సహకారంభారత్ యూరోపియన్ యూనియన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
జనరల్

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?
జనరల్

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?
జనరల్

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!