

పంజాబ్‌లో రేప్ కేసుల సెటిల్‌మెంట్ పేరుతో రూ.5 కోట్ల వరకు లంచాలు తీసుకుంటున్నారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఆయన భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎం కార్యాలయం అక్రమ వ్యవహారాలకు కేంద్రంగా మారిందని పేర్కొంది. ఓ రేప్ కేసును కొట్టివేయించేందుకు గుర్‌ప్రీత్ కౌర్ రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 21న దర్యాప్తునకు ఆదేశించినట్లు బీజేపీ తెలిపింది.
గురువారం మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్య కలిసి పంజాబ్‌ను ‘ఆప్ లూట్ మోడల్’గా మార్చారని ఆరోపించారు. అక్రమ డీల్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దళారులను నియమించుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఓ ఆడియో రికార్డింగ్‌ను వినిపించిన భండారి.. అందులో ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ను ‘సూపర్ సీఎం’గా పేర్కొంటూ, సీఎం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని చెప్పినట్లు వివరించారు. అయితే, ఈ ఆరోపణలను సంబంధిత పక్షాలు ధృవీకరించాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!