

మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ చేసిన ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఏసీబీలో అవినీతికి ఏమాత్రం తావులేదని, అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని స్పష్టం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అధికారిపై మాజీ ఏడీఈ చేసిన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా శాఖాపరమైన విచారణ చేపడతామని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ ఫిర్యాదుకు సంబంధించి ఫిర్యాదుదారుడిని ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని పిలిచినప్పటికీ, ఆయన ఒక్కసారి కూడా హాజరుకాలేదని అధికారులు తెలిపారు. ఆరోపణలు విచారణలో నిరూపితమైతే సంబంధిత ఏసీబీ అధికారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొంత శాఖకు చెందిన అధికారులైనా అవినీతి ఆరోపణల విషయంలో ఉపేక్షించేది లేదని తెలంగాణ ఏసీబీ తేల్చిచెప్పింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!