25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

Writer: Shivani K 03:49 PM, 25 నవంబర్, 2026
ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నగరమంతా క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా అలంకరణలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారులను బాధ్యులుగా నియమించి, పోలీసు, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలవారీగా మంత్రులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఏర్పాట్లను ఇన్‌ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. మహబూబ్‌నగర్‌కు జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌కు సుదర్శన్‌రెడ్డికి బాధ్యతలు కేటాయించారు.

క్రీడాకారులు, ఆహ్వానితులకు నాణ్యమైన ఆహారం, వసతి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. స్టేడియంల పునరుద్ధరణ పనులతో పాటు అన్ని ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాలని అధికారులకు సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, దేశంలోని అత్యుత్తమ శిక్షకులతో నాణ్యమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ఈ పోటీలను సమర్థంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

ఏపీ మద్యం షాపుల్లో బాటిల్ స్కానింగ్ విధానం.. త్వరలో అమలు?

ఏపీ మద్యం షాపుల్లో బాటిల్ స్కానింగ్ విధానం.. త్వరలో అమలు?

ట్యాగ్లు
ఖేలో ఇండియాసీఎం రేవంత్ రెడ్డితెలంగాణ క్రీడలుక్రీడా పోటీలుహైదరాబాద్ఎల్బీ స్టేడియంగచ్చిబౌలి స్టేడియంక్రీడాకారులుక్రీడా శిక్షణతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
బిజినెస్

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే
ఓటీటీ

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన
జనరల్

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
జనరల్

ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

దీపావళి వేళ క్విక్‌ కామర్స్‌ జోరు..
బిజినెస్

దీపావళి వేళ క్విక్‌ కామర్స్‌ జోరు..

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం
రాజకీయాలు

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ
జనరల్

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!
సినిమాలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా
క్రీడలు

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు
సినిమాలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
టెక్నాలజీ

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!