
రాజకీయాలు

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్ కూర్పుపై కొత్త వివాదం నెలకొంది. కేబినెట్‌లో ఇద్దరు బ్రాహ్మణులకు చోటు కల్పించడం, అలాగే దేవాదాయ శాఖను బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. శాఖలను కులాలు, మతాల ప్రాతిపదికన కేటాయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది.
ఈ విమర్శలకు స్పందించిన మంత్రి రమేష్, తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తనకు మరియు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌కు కులం ఆధారంగా ఓట్లు రాలేదని, సీఎం విజయ్ నాయకత్వంతోనే విజయం సాధించామని పేర్కొన్నారు. కుల ప్రాతిపదికన పదవులు ఇవ్వలేదని ఆయన తేల్చిచెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!