
రాజకీయాలు

ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. విద్యార్థుల కేరింతలు, ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.
చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో క్రీడాపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మెస్సీ గతంలో ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!