

చెట్లపై పక్షులు నివసించడం సాధారణమే. అయితే ఇండోనేషియాలోని పపువా ప్రాంతానికి చెందిన కొరోవాయి తెగ ప్రజలు చెట్లపైనే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. దట్టమైన అడవుల్లో నివసించే వీరు నేల నుంచి సుమారు 10 నుంచి 50 మీటర్ల ఎత్తులో తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. నేలకు దూరంగా నివసించడం వల్ల అడవి జంతువుల నుంచి రక్షణ పొందవచ్చని వారు భావిస్తారు. అంతేకాకుండా ఎత్తులో ఇల్లు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాన్ని సులభంగా గమనించవచ్చని చెబుతున్నారు.
అడవిలో లభించే కలప, ఆకులు, ఇతర సహజ వనరులతోనే కొరోవాయి ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకుంటారు. ఎత్తులో ఉన్న ఇళ్లలోకి వెళ్లేందుకు చెక్క నిచ్చెనలను ఉపయోగిస్తారు. బయట నుంచి ఈ ఇళ్లు చిన్నవిగా కనిపించినప్పటికీ, కుటుంబ సభ్యులందరూ ఉండేందుకు లోపల తగినంత స్థలం ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన ఇళ్లకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగర జీవనానికి పూర్తి భిన్నంగా ఉన్న కొరోవాయి తెగ ప్రజల జీవనశైలి చాలామందిని ఆకట్టుకుంటోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!