
బిజినెస్

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ శ్రీగౌరీ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత నివారణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై మహిళలకు వివరించారు. నెల రోజుల పాటు జరిగే పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ వరలక్ష్మితో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!