

వీధి వ్యాపారులకు సులభంగా అధికారిక రుణ సదుపాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా రెండో విడత రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించిన అర్హత ఉన్న వీధి వ్యాపారులకు యూపీఐ-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ కార్డుకు రూ.30,000 వరకు క్రెడిట్ పరిమితి ఉంటుంది. వ్యాపార అవసరాలకు తక్షణ రుణ సదుపాయం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
పీఎం స్వనిధి కింద రుణ సదుపాయాన్ని కూడా పెంచారు. అర్హులైన వీధి వ్యాపారులకు మొదటి విడతలో రూ.15,000 వరకు, రెండో విడతలో రూ.25,000 వరకు, మూడో విడతలో రూ.50,000 వరకు పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు లభిస్తాయి. సకాలంలో రుణం చెల్లించే వారికి 7 శాతం వడ్డీ సబ్సిడీతో పాటు డిజిటల్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఈ పథకం రుణాల కాలాన్ని మార్చి 2030 వరకు పొడిగించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!