

టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీడబ్ల్యూయూ (రిజిస్ట్రేషన్ నం. A-4522)కు జిల్లాలు, నగరాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో పార్టీ శ్రేణులు, కార్మికులు సహకరించాలని ఆయన కోరారు. టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు అక్టోబర్ 9న పోలింగ్, అక్టోబర్ 17న ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయం చేసేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఇన్‌చార్జిగా నియమించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, వారి భవిష్యత్తు, పనివేళల పరిరక్షణ, విలీన ప్రక్రియ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచే యూనియన్‌కు కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వంతో అధికారికంగా చర్చించే హక్కు ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!