
జనరల్

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను ప్రాంతాన్ని బట్టి 20 నుంచి 300 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. అయితే భూ భారతి పోర్టల్‌లో మార్కెట్ విలువల మాడ్యూల్‌ను తొలగించడంతో గందరగోళం నెలకొంది.
మునుపటి రోజుల్లో భూమి వివరాలతో పాటు ఎకరాకు ఎంత మార్కెట్ విలువ ఉందో పోర్టల్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ కాలమ్ కనిపించడం లేదు. కొన్ని రోజులు మాత్రమే కనిపించి మళ్లీ మాయం కావడంతో గ్రామాల వారీగా భూ విలువలు తెలుసుకోవడం కష్టంగా మారింది.
ఈ మార్పుతో తహశీల్దార్ స్థాయిలో కూడా భూ విలువలు నిర్ధారించడం కష్టంగా మారింది. స్టాంప్ డ్యూటీ లెక్కల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారదర్శకత లేకపోవడంపై అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!