

తీర్పుల ప్రకటనలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు దేశంలోని అన్ని హైకోర్టులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను సాధారణంగా మూడు నెలల్లోపు ప్రకటించాలని స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్లను వీలైనంత వరకు అదే రోజు విచారించి నిర్ణయం ఇవ్వాలని, ఒకవేళ ఉత్తర్వు రిజర్వ్ చేస్తే మరుసటి రోజే ప్రకటించాలని సూచించింది.
న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. బహిరంగ న్యాయస్థానంలో ప్రకటించిన తీర్పులను 24 గంటల్లోపు హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. మూడు నెలలు దాటినా రిజర్వ్ చేసిన తీర్పు వెలువడకపోతే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. అలాగే బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వులను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి ఖైదీల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!