
జనరల్

నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణంపై దాఖలైన కేసును సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణ వరకు చెట్లను నరికేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పార్కు పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో 25–30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను తొలగించరాదని స్పష్టం చేసింది.
విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి సుమారు 1300 చెట్లు నరికేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చెట్లు తొలగించకుండా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదైనా ఉందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాంటి ప్రణాళిక లేదని న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం రాత్రింబవళ్లు చెట్లను నరికేస్తోందని ఆయన ఆరోపించారు. వాదనలు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!