
జనరల్

ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారి-16పై హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా ఇంజన్ భాగం నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపి 36 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించేశారు.
కొద్ది సేపటికే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!