Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వికసిత్ భారత్ ఉపాధి మిషన్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం

Writer: Pooja 01:11 PM, 2 జులై, 2026
వికసిత్ భారత్ ఉపాధి మిషన్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు జాబ్ కార్డులు అందజేసి, పథకం సమాచార పుస్తకం, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్, మిషన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైల్వే కోడూరు నుంచే మరో జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. గతంలో నరేగా కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. వీబీజీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4,000 కోట్లు వెచ్చిస్తూ మొత్తం రూ.11,700 కోట్లతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ఈ పథకం ద్వారా 125 రోజుల ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి సాంకేతికతలతో పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. గాలేరు-నగరి నుంచి కోడూరుకు నీటిని తీసుకువచ్చి, జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచే చర్యలు కూడా చేపడతామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

నేడు భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం

నేడు భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం

కర్ణాటకలో ఘోర ప్రమాదం...బండరాయి కూలి ఏడుగురు మృతి

కర్ణాటకలో ఘోర ప్రమాదం...బండరాయి కూలి ఏడుగురు మృతి

కాండెరే బ్రాండ్ అంబాసిడర్‌గా స్మృతి మంధాన

కాండెరే బ్రాండ్ అంబాసిడర్‌గా స్మృతి మంధాన

ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం...నలుగురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం...నలుగురు అరెస్ట్

ట్యాగ్లు
వికసిత్ భారత్చంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్శివరాజ్ సింగ్ చౌహాన్ఉపాధి మిషన్తిరుపతి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు
జనరల్

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!