4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

Writer: Nithish 06:03 AM, 4 అక్టోబర్, 2026
విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్యను అందించడం ఎంతో కీలకమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూలో నిర్వహించిన ‘రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ కాన్‌క్లేవ్‌ ఇన్‌ హైదరాబాద్‌’ (రీచ్‌) 2026 సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. వికసిత్‌ భారత్‌, తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికల్లో మార్పులు తీసుకురావడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల సహకారంతో ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

సైయెంట్‌ వ్యవస్థాపకుడు బీవీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు కోరుకుంటున్న ప్రాయోగిక అనుభవాన్ని విద్యార్థులకు తరగతి గదిలోనే అందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పరిశోధన, ఆవిష్కరణలు తరగతి గదిలోనే ప్రారంభమయ్యేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి రచించిన ‘హైదరాబాద్‌ ఏ హబ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌, ఇన్నొవేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ పుస్తకాన్ని శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఈ.పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌, జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వీసీలు టి.కిషన్‌కుమార్‌రెడ్డి, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

ట్యాగ్లు
శ్రీధర్‌బాబుతెలంగాణ ఉన్నత విద్యపరిశోధనవిద్యార్థులుజేఎన్‌టీయూరీచ్‌ 2026నైపుణ్యాభివృద్ధిఆవిష్కరణలుఇంక్యుబేషన్‌ సెంటర్లుతెలంగాణ రైజింగ్‌ 2047
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!