

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకు సుమారు రూ.3,550 కోట్ల మేర ఆదా చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ మొత్తాన్ని పిల్లల విద్య, కుటుంబ అవసరాలు, భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే అవకాశం కలిగిందన్నారు. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఆదరిస్తున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం, ఈ మైలురాయిని సాధించడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!