
జనరల్

ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు స్వర్ణరథంపై ఆదిదంపతులు విహరించారు. అందంగా అలంకరించిన స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ స్వర్ణరథోత్సవంలో ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులతో పాటు భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్ర వేడుకలతో శ్రీశైల క్షేత్రం భక్తిభావంతో సందడిగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!