
జనరల్

బాపట్ల జిల్లా చీరాల పేరాలలోని శివాలయం సెంటర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ముందుగా ధ్వంసం చేసి, అనంతరం విగ్రహానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!