
జనరల్

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఐదు తలల చిన్నశేష వాహనంపై కొలువుదీరిన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలతో వాహనసేవ ఆధ్యాత్మిక వాతావరణంలో కనులపండువగా సాగింది. పురాణ విశ్వాసాల ప్రకారం, చిన్నశేష వాహన దర్శనం కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీయోగ సిద్ధికి సంబంధించిన ఆధ్యాత్మిక ఫలాలను అందిస్తుందని భావిస్తారు. ఈ వేడుకలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!