
జనరల్

‘దిత్వా’ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు భారత్ కీలక సహాయం అందిస్తోంది. ఈ కఠిన సమయంలో పక్క దేశమైన భారత్ ముందుకు వచ్చి సహాయక చర్యలు చేపట్టడం ప్రశంసనీయమని శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య పేర్కొన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా భారత్ అందించిన మద్దతును ఆయన గుర్తు చేసుకున్నారు.
శ్రీలంకకు భారత్ నిరంతరం అండగా నిలవడం ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి నిదర్శనమని జయసూర్య అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో మానవత్వంతో స్పందించిన భారత్ చర్యలను ఆయన ప్రశంసించారు. ఈ సహాయం వల్ల బాధితులకు ఉపశమనం కలుగుతుందని, అతి తర్వలోనే పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!