
జనరల్

హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థల యాజమాన్యాలకు కీలక సూచనలు జారీ చేశారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు లాగౌట్‌లు కల్పించాలని సూచించారు.

భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంతో పాటు అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వాహనదారుల భద్రత కోసం సంస్థలు సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!