
జనరల్

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వెంకీఅనిల్5 పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ కాస్టింగ్ కాల్స్ ప్రచారం జరుగుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసగాళ్లు ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని నిర్మాతలు తెలిపారు.

ఈ కాస్టింగ్ కాల్స్‌కు తమ చిత్ర యూనిట్‌కు ఎలాంటి సంబంధం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఎవరూ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు లేదా పత్రాలు షేర్ చేయవద్దని సూచించారు. అలాగే ఆడిషన్స్ లేదా ఎంపికల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో కాస్టింగ్‌కు సంబంధించిన ఏ ప్రకటన అయినా అధికారిక, వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారానే విడుదల అవుతుందని చిత్రబృందం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!