
జనరల్

సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ‘రావు బహదూర్' వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ప్రముఖ డిజిటల్ వేదిక సుమారు రూ.7 కోట్లకు ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తే అదనంగా మరికొంత మొత్తం చెల్లించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. దీంతో మొత్తం ఒప్పంద విలువ రూ.10 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!