
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో 12 కోవిడ్-19 కేసులు నమోదుకాగా, నాలుగు మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య నమోదైన కేసుల్లో కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది.
దేశవ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటివరకు 339 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 115 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, రాజస్థాన్‌లో 12, అండమాన్-నికోబార్ దీవుల్లో 8 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!