

మహిళల భద్రత, లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ పోలీసుల మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ లో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందారు.
డీజీపీ మహిళా భద్రత విభాగం చారు సిన్హా, డీఐజీ పరిమళ హనా నూతన్, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషులు, యువకులు మహిళల పట్ల గౌరవప్రదమైన వైఖరిని అలవరుచుకోవడం, లింగ వివక్షను నిరోధించడం, విద్యాసంస్థల్లో సురక్షితమైన వాతావరణాన్ని నిర్మించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు తమ తమ విద్యాసంస్థల్లో ఇదే తరహా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!