

విమానాశ్రయాలు, హోటళ్లలో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నటుడు సోనూసూద్ కీలక విజ్ఞప్తి చేశారు. గంటల తరబడి నిలబడి విధులు నిర్వహించే ఉద్యోగులకు సరైన కూర్చునే సదుపాయాలు, విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాలని విమానాశ్రయ అధికారులు, హోటల్ యాజమాన్యాలను కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. విమానాశ్రయ కౌంటర్లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌లలో పనిచేసే సిబ్బంది చిరునవ్వుతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నప్పటికీ, ఎక్కువసేపు నిలబడటం వల్ల వారు ఎదుర్కొనే శారీరక ఇబ్బందులను కూడా గుర్తించాలని సూచించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. విమానాశ్రయ కౌంటర్లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌లలో పనిచేసే ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిలబడే విధులు నిర్వహిస్తుంటారని పేర్కొన్నారు. ఇన్ని గంటల పాటు నిలబడటం ఎంతటి శారీరక అలసటకు కారణమవుతుందో యాజమాన్యాలు ఆలోచించాలని అన్నారు. ఉద్యోగులు అవసరమైనప్పుడు కూర్చుని విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఎత్తైన స్టూల్స్ లేదా సరైన కుర్చీలను ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్పిటాలిటీ రంగం అంటే కస్టమర్లకు సౌకర్యాన్ని అందించడమేనని, మరి ఆ సేవలు అందించే ఉద్యోగుల సౌకర్యం, సంక్షేమంపై కూడా యాజమాన్యాలు అదే శ్రద్ధ చూపించాలని ప్రశ్నించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!