

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, రీల్స్ అధికంగా వినియోగించడం వల్ల మెదడులో డోపమైన్ అనే ఆనంద రసాయనం అసహజ స్థాయిలో విడుదలవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వ్యాయామం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, లక్ష్యాలను సాధించడం వంటి సందర్భాల్లో విడుదలయ్యే డోపమైన్, రీల్స్ చూడటం, లైక్స్ రావడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం వల్ల ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ ‘డోపమైన్ స్పైక్’ క్రమంగా ‘డోపమైన్ లూప్’గా మారి, మరింత ఎక్కువ సంతోషాన్ని వెతికేలా చేసి స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారుస్తోంది.
తాజా పరిశోధనల ప్రకారం అధిక స్క్రీన్ టైమ్ వల్ల ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన, జ్ఞాపకశక్తి మందగించడం, కోపం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, యువతపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారతీయులు 2024లో స్మార్ట్‌ఫోన్లపై లక్ష కోట్ల గంటలకు పైగా గడిపినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం డిజిటల్ డిటాక్స్, స్క్రీన్ టైమ్ నియంత్రణ, తల్లిదండ్రుల పర్యవేక్షణ, స్వీయ క్రమశిక్షణ వంటి చర్యలు డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడేందుకు కీలకం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!