

ట్విషా శర్మ మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ట్విషా తన స్నేహితులతో సామాజిక మాధ్యమాల్లో మాట్లాడిన సందేశాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాను తీవ్ర ఆందోళనతో బాధపడుతున్నానని, జీవితంపై అయోమయంలో ఉన్నానని ఆమె తన స్నేహితులతో పంచుకున్నట్లు సమాచారం. పెళ్లి విషయంలో తొందరపడవద్దని, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ట్విషా శర్మకు డేటింగ్ వేదిక ద్వారా సమర్థ్ సింగ్‌తో పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఉద్యోగం మానేసిన ట్విషా,ఈ నెల 12న భోపాల్‌లోని ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యేనని ట్విషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోసారి మృతదేహ పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!