

ఆమ్ ఆద్మీ పార్టీ నేత దీపక్ సింగ్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకు మోసం కేసుతో సంబంధం ఉన్న ధన అక్రమ మార్పిడి వ్యవహారంలో ఈ చర్యలు చేపట్టారు. ఢిల్లీ, గోవా సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, గోవా రాష్ట్ర పార్టీ బాధ్యుడిగా ఉన్న దీపక్ సింగ్లాను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
దీపక్ సింగ్లా హవాలా మార్గంలో ఢిల్లీ, గోవా మధ్య పార్టీ నిధులను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో సుమారు రూ.150 కోట్ల మోసానికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఆ డబ్బును సింగపూర్‌కు తరలించి, మళ్లీ హవాలా మార్గంలో భారత్‌కు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!