
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో రానున్న వారం రోజులపాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రేపటి నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండగా, పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!