
సినిమాలు

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఈనెల 26 వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో హీట్‌వేవ్ తీవ్రత అధికంగా నమోదవుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
భద్రాచలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మంలో 45.4°C నమోదైంది. హనుమకొండలో 44.0°C, రామగుండంలో 44.1°C, ఆదిలాబాద్‌లో 43.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 43.5°C, మెదక్‌లో 42.8°C, నల్గొండలో 42.5°C నమోదుకాగా, హైదరాబాద్‌లో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!