

పండుగలు, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్ సమయంలో కనిపించే భారీ డిస్కౌంట్లు ఈ ఏడాది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడిసరుకు ధరలు, అంతర్జాతీయ రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఖర్చులను నియంత్రించేందుకు ఆఫర్లను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిస్కౌంట్లు గతేడాదితో పోలిస్తే 5 నుంచి 10 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సేల్స్‌లో కూడా పరిమిత ప్రొడక్ట్స్‌పైనే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
రవాణా వ్యవస్థలో అంతరాయాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం వల్ల కంపెనీల వ్యయాలు పెరిగాయి. ఈ భారం పూర్తిగా వినియోగదారులపై మోపలేకపోవడంతో కంపెనీలు డిస్కౌంట్లను తగ్గిస్తున్నాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి లాంగ్ టర్మ్ ఈఎంఐలు, ఫైనాన్స్ స్కీమ్స్‌ను ప్రవేశపెడుతున్నారు. మరోవైపు, కొన్ని ప్రముఖ బ్రాండ్లు పూర్తి ధరలకే అమ్మకాలు జరుపుతున్నప్పటికీ, డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!