
క్రీడలు

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కోల్‌కతాలో భద్రతా లోపాన్ని ఎదుర్కొన్నారు. ఓ కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆయన కారులోకి ప్రవేశించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కారులోకి ప్రవేశించిన వ్యక్తి ఎవరు, అతని ఉద్దేశం ఏమిటన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఈ సంఘటనతో ప్రముఖుల భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!