

జూనియర్ ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క ‘భగీర’ మృతితో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. పెంపుడు శునకంగా తన జీవితంలోకి వచ్చిన భగీర కొద్దికాలంలోనే కుటుంబ సభ్యుడిగా మారిపోయిందని తెలిపారు. దాని ప్రేమ, విశ్వాసం, అల్లరితో తన అలసటను ప్రతిరోజూ దూరం చేసేదని, ఇప్పుడు భగీరను కోల్పోవడం ఎంతో బాధగా ఉందని పేర్కొన్నారు. దానితో ముడిపడిన జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉంటాయని ఎన్టీఆర్ అన్నారు.
ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు సూచించినట్లు సమాచారం. మరోవైపు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!